కారు డోర్స్ లాక్ అయి.. చిన్నారి మృతి..ఎన్ని ఘటనలు జరిగినా?

ఆగి ఉన్న కారులో చిన్నారి వెళ్లి డోర్ లాక్ అవ్వడంతో మృతి చెందిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగింది

Update: 2024-05-22 07:51 GMT

ఆగి ఉన్న కారులో చిన్నారి వెళ్లి డోర్ లాక్ అవ్వడంతో మృతి చెందిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగింది. ఈ ఘటన కుటుంబంలో విషాదం నింపింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మణుగూరు మండలం సాంబాయిగూడెంలో లో కల్నీష అనే మూడేళ్ల చిన్నారి ఆడుకుంటూ ఆగి ఉన్న కారులోపలికి వెళ్లింది. అయితే కారులోపలకి చిన్నారి వెళ్లగానే డోర్లు లాక్ అయిపోయాయి. అయితే ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు ఎవరూ గమనించలేదు.

ఊపిరాడక...
దీంతో ఊపిరాడక చిన్నారి మరణించింది. పాప కోసం తల్లిదండ్రులు ఎంత గాలించినా కనపడకపోవడంతో ఆందోళన చెందారు. చివరకు కారులో బాలిక మృతదేహం కనిపించింది. కారు డోర్ ఓపెన్ చేసి పాపను బయటకు తీయగా అప్పటికే మరణించినట్లు గుర్తించారు. దీంతో ఆ కుటుంబం విషాదంలో మునిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే తరచూ ఇలాంటి ఘటనలు అనేకం చోటు చేసుకుంటున్నా కారు యజమానులు తగిన జాగ్రత్తలు తీసుకోవడంలో విఫలమవుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కారు ఆపిన తర్వాత డోర్ లాక్ చేసి వెళితే ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదు కదా? అన్న ప్రశ్నకు వారి వద్ద నుంచి సమాధానం లేదు.


Tags:    

Similar News