నేడు మహాయాగానికి అంకురార్పణ

యాదాద్రి ఆలయ ఉద్ఘాటన కార్యక్రమం నేడు ప్రారంభం కానుంది.

Update: 2022-03-21 00:58 GMT

యాదాద్రి ఆలయ ఉద్ఘాటన కార్యక్రమం నేడు ప్రారంభం కానుంది. ఇందులో కీలక ఘట్టమైన పంచనారసింహుల ఆలయ మహాకుంభ సంప్రోక్షణలో భాగంగా పంచకుండాత్మక మహాయాగానికి నేడు అంకురార్పణ జరగనుంది. ఇందుకోసం యాగశాలలో పంచకుండాలను సిద్ధం చేశారు. ఉదయం 9గంటలకు పూజతో ఈ కార్యక్రమం ప్రాంరంభం కానుంది. బాలాలయంలో అష్టోష్టత్తర శతఘటాభిషేకాన్ని మహారాజాభిషేకంగా నిర్వహిస్తారు.

108 కలశాలతో......
108 కలశాలతో దేవతారాధనలను జరిపి విశిష్ట అభిషేకాన్ని నిర్వహించనున్నారు. ఈ యాగాన్ని సామాన్య భక్తులు తిలకించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ యాగం కోసం 108 మంది పారాయణికులను రప్పించారు. నేటి నుంచి యాదాద్రికి భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉండటంతో భారీ భద్రత ఏర్పాట్లు కూడా చేపట్టారు.


Tags:    

Similar News