ఫాంహౌస్ కేసు : సైబరాబాద్ పోలీసులకు ఊరట

మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో హైకోర్టు ప్రభుత్వ వాదనను పరిగణనలోకి తీసుకుంది. ఏసీబీ కోర్టు ఇచ్చిన ఆర్డర్ ను కొట్టివేసింది.

Update: 2022-10-29 06:57 GMT

మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో హైకోర్టు ప్రభుత్వ వాదనను పరిగణనలోకి తీసుకుంది. ఏసీబీ కోర్టు ఇచ్చిన ఆర్డర్ ను హైకోర్టు కొట్టివేసింది. సైబరాబాద్ పోలీసు కమిషనర్ ముందు హాజరుకావాలని పేర్కొంది. సైబరాబాద్ పోలీసులకు హైకోర్టులో ఊరట లభించింది. సైబరాబాద్ పోలీసుల రివిజన్ పిటీషన్ ను హైకోర్టు అనుమతించింది.

మెజిస్ట్రేట్ ముందు....
నిందితులను మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చాలని కోరింది. నిందితుల రిమాండ్ కు హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఫాం హౌస్ కేసులో నిబంధనలను పాటించడం లేదని ఏసీబీ కోర్టు రిమాండ్ ను తోసిపుచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై సైబరాబాద్ పోలీసులు హైకోర్టును ఆశ్రయించారు.


Tags:    

Similar News