Revanth Reddy : సంక్షోభం తలెత్తేలా కుట్ర జరిగింది : సమీక్షలో సీఎం

తొలి మంత్రి వర్గ సమావేశంలో రేవంత్ రెడ్డి ప్రధానంగా విద్యుత్తు శాఖపై ఎక్కువగా దృష్టి పెట్టారు

Update: 2023-12-08 02:17 GMT

తొలి మంత్రి వర్గ సమావేశంలో రేవంత్ రెడ్డి ప్రధానంగా విద్యుత్తు శాఖపై ఎక్కువగా దృష్టి పెట్టారు ఆ శాఖలో నిధులు ఎక్కువగా దుబారా అయ్యాయయన్న ఆరోపణలు ఆయన గతం నుంచే చేస్తున్నారు. ఈనేపథ్యంలో ముఖ్యమంత్రి పదవి చేపట్టిన వెంటనే తొలి మంత్రి వర్గ సమావేశంలో విద్యుత్తు శాఖపై ఎక్కువగా చర్చించారు.

నిధులు దుర్వినియోగం...
వాస్తవాలను వెల్లడించకుండా ఆ శాఖ పెద్దయెత్తున నిధులను దుర్వినియోగం చేసిందని, ఎక్కువ మొత్తానికి కరెంట్ ను కొనుగోలు చేసిందని రేవంత్ పలు సభల్లో ఆరోపిస్తూ వస్తున్నారు. విద్యుత్తు సంక్షోభం తలెత్తేలా ఒక ఉన్నతాధికారి చర్యలను ఆయన ఈ విధంగా ప్రస్తావించినట్లు సమాచారం. విద్యుత్తు శాఖ ఇప్పటి వరకూ 85 వేల కోట్ల అప్పు చేసిందని, దానికి సంబంధించిన లెక్కలు చూపించాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి రేవంత్ అభిప్రాయపడినట్లు చెబుతున్నారు.
నేడు సమీక్ష...
శనివారం ముఖ్యమంత్రి ప్రత్యేకంగా విద్యుత్తు శాఖపై సమీక్ష చేయనున్నారని తెలిపారు. ట్రాన్స్ కో, జెన్ కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్ రావు రాాజీనామాను ఆమోదించవద్దని, శునివారం తాను చేయబోయే సమీక్షకు ఆయనను కూడా పిలిపించాలని ముఖ్యమంత్రి రేవంత్ కోరినట్లు తెలిసింది. లేకుంటే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని కూడా ఆయన సంకేతాలు ఇచ్చినట్లు సమాచారం. దీంతో ఈరోజు విద్యుత్తు శాఖపై జరగనున్న సమీక్షలో ముఖ్యమంత్రి ఎవరిని టార్గెట్ చేస్తారన్న టెన్షన్ అధికారులకు పట్టుకుంది.


Tags:    

Similar News