రాబోయే గంటల్లో హైదరాబాద్ లో భారీ వర్షం పడే అవకాశం

హైదరాబాద్ లో శుక్రవారం సాయంత్రం పలు ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని

Update: 2022-05-20 12:47 GMT

హైదరాబాద్ లో శుక్రవారం సాయంత్రం పలు ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. IMD-హైదరాబాద్ అంచనా ప్రకారం, రంగారెడ్డి, హైదరాబాద్, కామారెడ్డి, నిజామాబాద్, సంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, నారాయణపేట, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో శుక్రవారం సాయంత్రం వర్షం పడే అవకాశం ఉంది. "రాబోయే మూడు గంటల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షం/ఉరుములతో కూడిన మెరుపులు మరియు 30 నుండి 40 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది" అని శుక్రవారం సాయంత్రం 4.30 గంటలకు వాతావరణ శాఖ తెలిపింది. ఆంధ్రప్రదేశ్ లో రాగల రెండు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర, దక్షిణ కోస్తా, రాయలసీమలో రాగల రెండు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని వెల్లడించింది.

తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఈ నెల 21వ తేదీ వరకు మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ(IMD) ఇప్పటికే వెల్లడించింది. అండమాన్ నికోబార్ దీవుల దగ్గర నైరుతి రుతుపవనాలు బంగాళాఖాతంలో చురుగ్గా కదులుతున్నాయి. మరో వారం రోజుల్లో కేరళ(Kerala) ను తాకే అవకాశం ఉందని తెలిపింది. జూన్ 5 నుంచి జూన్ 10లోపు తెలంగాణలోని నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉంది. ఏపీలో రాబోయే రెండు రోజుల్లో నైరుతి రుతుపవనాలు దక్షిణ, మధ్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలు, దక్షిణ అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాలకు విస్తరించే అనుకూల వాతావరణం కనిపిస్తుందని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో ఈ నెల 21వ తేదీ వరకు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది.


Tags:    

Similar News