Weather Report : ఫ్యాన్ స్విచ్ వేస్తే ఒట్టు.. సింగిల్ డిజిట్ కు టెంపరేచర్స్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో చలితీవ్రత రాను రాను పెరుగుతోంది.

Update: 2025-11-15 04:15 GMT

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో చలితీవ్రత రాను రాను పెరుగుతోంది. ఇదే చలిగాలులు మరో వారం రోజుల పాటు కొనసాగుతాయని వాతావరణ శాఖ చెప్పింది. రెండు రాష్ట్రాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎన్నడూ లేని విధంగా చలిగాలులు ముందే రాష్ట్రాల్లోకి ప్రవేశించాయి. నవంబరు నెల మొదటి వారం నుంచి చలిగాలుల తీవ్రత పెరుగుతోంది. శీతాకాలం ముందే వచ్చింది. గత వారం రోజుల నుంచి చలితీవ్రత రెండు రాష్ట్రాల్లో పెరిగిపోయింది. రెండు రాష్ట్రాల్లో విద్యుత్తు వినియోగం కూడా గణనీయంగా తగ్గిందనే చెప్పాలి. పగటి పూట కూడా ఫ్యాన్లు వాడటం లేదంటే చలి తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అలాగే రాత్రి వేళ దుప్పట్ల నుంచి బయటకు జనం రావడానికి భయపడిపోతున్నారు.

ఆంధ్రప్రదేశ్ లో తగ్గుతున్న...
ఉదయం ఎనిమిది గంటల వరకూ, సాయంత్రం ఐదు గంటల నుంచి చలితీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ లో అనేక జిల్లాల్లో చలిగాలులు వణికిస్తున్నాయి. ఇక ఏజెన్సీ ప్రాంతాలైన విశాఖ, అరకు, పాడేరు, తూర్పుగోదావరి జిల్లాలోని పలు ప్రాంతాల్లో చలిగాలులు మరింత ఎక్కువగా ఉన్నాయి. సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చలి తీవ్రత తక్కువగా ఉండటంతో అరకు వంటి ప్రాంతాలకు పర్యాటకుల సంఖ్య పెరిగింది. పొగమంచు తో కొండలను కూడా కనిపించకుడా చేస్తూ పర్యాటకులను కనువిందు చేస్తుంది. దీంతో పర్యాటక ప్రాంతాలకు ప్రజలు పోటెత్తుతున్నారు. ఇక చలిగాలుల నుంచి వృద్ధలు, చిన్నారులు తమను తాము కాపాడుకోవాలని సూచిస్తున్నారు.
తెలంగాణలోనూ చలి ఎక్కువగా...
తెలంగాణలోనూ అనేక ప్రాంతాల్లో చలిగాలుల తీవ్రత ఎక్కువగా ఉంది. ప్రధానంగా హైదరాబాద్ నగరం సాయంత్రం ఐదు గంటల నుంచి చలి తీవ్రత ఎక్కువవుతుంది. ఇక రాత్రంతా ఒకటే చలి. ఇక ఉదయం 9 గంటల వరకూ చలిగాలుల తీవ్రత తగ్గడం లేదు. దీంతో పాటు ఉత్తర తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో చలి తీవ్రత మరింత ఎక్కువగా ఉంది. సిర్పూర్ లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కుమ్రంభీం జిల్లాలో 8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వాతావరణ శాఖ వెల్లడించింది. మరో వారం రోజుల పాటు ఈ చలిగాలుత తీవ్రత ఎక్కువగా ఉంటుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.












Tags:    

Similar News