Hyderabad : ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ లో ఉగ్రవాదులంటూ ఫోన్.. అలెర్ట్ అయిన పోలీసులు

ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ లో ఉగ్రవాదులున్నారని హైదరాబాద్ పోలీసులకు సమాచారం అందింది.

Update: 2025-09-26 06:02 GMT

ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ లో ఉగ్రవాదులున్నారని హైదరాబాద్ పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ ను ఘట్ కేసర్ వద్ద పోలీసులు నిలిపారు. ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. రైలులో అనుమానస్పదంగా ఉన్న వారిని అదుపులోకి తీసుకుని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. వారి వద్ద ఉన్న ఐడీ, ఆధార్ వంటి వాటిని తనిఖీలు చేస్తున్నారు.

ఫోన్ చేసిన వ్యక్తి కోసం..
ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ లో ఉగ్రవాదులున్నారంటూ గుర్తు తెలియని వ్యక్తి పోలీసులకు ఫోన్ చేసి చెప్పాడు. దీంతో అప్రమత్తమయిన పోలీసులు ఈ నతిఖీలు నిర్వహిస్తున్నారు. రైల్వే స్టేషన్లలోనూ భద్రతను కట్టుదిట్టం చేశారు. మరొకవైపు పోలీసులకు సమాచారం ఇచ్చిన ఫోన్ నెంబరు ఎక్కడి నుంచి వచ్చిందన్న దానిపై ఆరా తీస్తున్నారు. బస్టాండ్లలోనూ పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు.


Tags:    

Similar News