Telangana : రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం .. ఈ జిల్లాలకు హై అలెర్ట్
తెలంణ రాష్ట్రంలోని ఈ జిల్లాల్లో రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం పడుతుందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది
తెలంణ రాష్ట్రంలోని ఈ జిల్లాల్లో రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం పడుతుందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఉదయం నుంచి ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. ఉక్కపోత కూడా అధికంగా ఉంది. అయితే మరికొద్ది గంటల్లో భారీ వర్షం పడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు రాకపోవడం మంచిదని అధికారులు సూచిస్తున్నారు.
బయటకు రావద్దంటూ...
మరో రెండు గంటల్లో ఈ జిల్లాలకు హై అలెర్ట్ ను హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, ములుగు, వరంగల్, నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి జిల్లాలకు భారీ వర్షం పడుతుందని తెలిపింది. మిగిలిన జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడతాయని పేర్కొంది. ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.