Telangana : ఐఏఎంసీకి కేటాయించిన భూముల రద్దు
హైదరాబాద్ లో అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ మీడియేషన్ సెంటరకు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన భూ కేటాయింపులను హైకోర్టు రద్దు చేసింది
తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు చెప్పింది. హైదరాబాద్ లో అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ మీడియేషన్ సెంటరకు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన భూ కేటాయింపులను హైకోర్టు రద్దు చేసింది. రాయదుర్గంలో ఐఏఎంసీకి ప్రభుత్వం గతంలో 3.5 ఎకరాల భూమి కేటాయించింది. అయితే నిబంధనలకు విరుద్ధంగా ఈ భూములను కేటాయించిందంటూ రెండు పిటీషన్లు హైకోర్టులో దాఖలయ్యాయి.
350 కోట్ల విలువైన...
350 కోట్ల విలువైన భూమిని నిబంధనలకు విరుద్ధంగా కేటాయించారంటూ ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలయిన పిటీషన్లపై విచారించిన హైకోర్టు ఇరువర్గాల వాదనలను వినింది. చివరకు హైకోర్టు ఐఏఎంసీ కి కేటాయించిన భూమి కేటాయింపులను రద్దు చేస్తూ తీర్పు చెప్పింది. జనవరిలో ఈ పిటీషన్లపై వాదనలు జరిపి రాయదుర్గంలోని సర్వే నెంబరు 83/1లో భూమిని కేటాయిస్తూ జారీ చసిన జీవోను రద్దు చేసింది.భవన నిర్మాణ పనుల కోసం జారీ చేసిన జీవోలను కూడా కొట్టివేసింది.