తెలంగాణకు భారీ వర్షసూచన..

రానున్న మూడ్రోజుల్లో తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. వచ్చే మూడ్రోజుల్లో రాష్ట్రంలోని

Update: 2022-01-10 08:00 GMT

రానున్న మూడ్రోజుల్లో తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. వచ్చే మూడ్రోజుల్లో రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈనెల 12వ తేదీన జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవచ్చని తెలిపింది.

ప్రస్తుతం ఆగ్నేయ దిశ నుంచి రాష్ట్రంలోకి ఉపరితల గాలులు వీస్తున్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది. కాగా.. ఇప్పటికే నిజామాబాద్ జిల్లాలో నిన్న రాత్రి నుంచి ఎడతెరపిలేకుండా వర్షం కురుస్తోంది. వర్షం కారణంగా.. జిల్లాలోని పలు ప్రాంతాల్లో రోడ్లు కూడా జలమయమయ్యాయి. ఆదిలాబాద్ జిల్లాలోనూ భారీగా వర్షాలు కురుస్తుండగా.. ఆ ప్రాంతంలోని పంటలు ఇప్పటికే నీటమునిగాయి. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు.


Tags:    

Similar News