హైదరాబాద్ లో భారీ వర్షం.. రోడ్లు జలయమం.. ట్రాఫిక్ కు అంతరాయం

ఆకాశానికి చిల్లు పడిందా అన్న చందంగా.. భారీ వర్షం కురవడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. రోడ్లు చెరువుల్లా మారడం, మరోవైపు వర్షం

Update: 2022-10-06 11:25 GMT

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గురువారం మధ్యాహ్నం నుంచి భారీ వర్షం కురుస్తోంది. సికింద్రాబాద్, మల్కాజిగిరి, అంబర్ పేట, పంజాగుట్ట, బంజారాహిల్స్, ఖైరతాబాద్ ప్రాంతాల్లో ఆకాశానికి చిల్లు పడిందా అన్న చందంగా.. భారీ వర్షం కురవడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. రోడ్లు చెరువుల్లా మారడం, మరోవైపు వర్షం పడుతూ ఉండటంతో వాహనదారులకు ట్రాఫిక్ కష్టాలు తప్పలేదు. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. వికారాబాద్ లోనూ భారీ వర్షాలు పడుతుండటంతో.. వాగులు, వంకలు ఉప్పొంగుతున్నాయి. పరిగి - మహబూబ్ నగర్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో పోలీసులు రాకపోకలను నిలిపివేశారు.

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఈ వర్షాలు కురుస్తున్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మరో రెండు మూడ్రోజుల పాటు వానలు కొనసాగుతాయని వెల్లడించింది. మరోవైపు ఏపీలో నిన్న భారీ వర్షాలు కురిశాయి. భారీ వర్షాలకు పలు ప్రాంతాల్లో దసరా వేడుకలకు అంతరాయం ఏర్పడింది. నేడు కూడా అక్కడక్కడా వర్షాలు కురుస్తున్నాయి.


Tags:    

Similar News