గచ్చబౌలి వ్యవహారంపై సుప్రీంలో విచారణ
హైదరాబాద్ లోని కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది
హైదరాబాద్ లోని కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. పర్యావరణ అనుమతులు తీసుకున్నారా? లేదా? అని స్పష్టం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని జస్టిస్ బీఆర్ గవాయ్ ప్రశ్నించింది. లాంగ్ వీకెండ్ చూసిన ఎందుకు చర్యలు మొదలుపెట్టారని కూడా ప్రశ్నించింది.
నష్టాన్ని పూడ్చేందుకు...
నష్టాన్ని పూడ్చేందుకు ప్రభుత్వం తీసుకునే చర్యలను స్పష్టంగా చెప్పాలని తెలిపింది. పర్యావరణ జరిగే నష్టాన్ని పూడ్చే చర్యలు చేపట్టకపోతే చీఫ్ సెక్రటరీతో సహా అందరూ జైలుకు వెళ్లాల్సి ఉంటుందని హెచ్చరించింది. విజిల్ బ్లోయర్స్, విద్యార్థులపై కేసులు విషయాన్ని పలువురు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. తదుపరి విచారణను జులై 23వ తేదీకి వాయిదా వేసింది.