Harish Rao : బెదిరిస్తూ ఎమ్మెల్యేలను లొంగదీసుకునే యత్నం

అక్రమ కేసులతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బెదిరించి తమ వైపునకు తిప్పుకునే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తుందని హరీశ్‌రావు అన్నారు

Update: 2024-03-15 05:32 GMT

అక్రమ కేసులతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బెదిరించి తమ వైపునకు తిప్పుకునే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తుందని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహీపాల్ రెడ్డి సోదరుడు అరెస్ట్ ను ఆయన ఖండించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పాలనను గాలికి వదిలేసి బీఆర్ఎస్ నేతలపై అక్రమ కేసులు పెట్టడమే లక్ష్యంగా పెట్టుకుందన్నారు. ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వకుండా ఎలా అరెస్ట్ చేస్తారని ఆయన ప్రశ్నించారు. ఏదో రకంగా జైలులో వేయాలన్న అక్కసుతోనే కాంగ్రెస్ నేతలున్నారన్నారు.

కేసులతో బెదిరించి...
తమ పార్టీలోకి రాని నాయకులను కేసులతో బెదిరిస్తున్నారన్నారు. మాట వినని నేతలు, వారి కుటుంబ సభ్యులపై అక్రమ కేసులు బనాయిస్తూ లొంగదీసుకోవాలని ప్రయత్నిస్తున్నారని హరీశ్‌రావు ఆరోపించారు.కాంగ్రెస్ నాయకులకు కూడా అక్కడ క్లషర్లు ఉన్నాయన్న హరీశ్ రావు, అనుమతి లేకున్నా కొందరు కాంగ్రెస్ నేతలు అక్రమ మైనింగ్ చేస్తున్నారన్నారు. దీనిపై తాము న్యాయపోరాటం చేస్తామని చెప్పారు. ఇప్పటికే మూడు కేసులు పెట్టారని, వీటిపై తాము న్యాయపోరాటం చేస్తామని అన్నారు. గ్రామాల్లో తాగు, సాగు నీరు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నా పట్టించుకోవడం లేదన్నారు.


Tags:    

Similar News