ఆ ఆరోపణల్లో నిజం లేదు: హరీష్ రావు

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో శ్వేతపత్రాన్ని విడుదల

Update: 2023-12-20 08:58 GMT

harish rao telangana government white paper

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో శ్వేతపత్రాన్ని విడుదల చేసింది. ఈ శ్వేతపత్రంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు తీవ్ర విమర్శలు గుప్పించారు. శ్వేతపత్రం తప్పుల తడకగా ఉందని.. చూపించిన లెక్కలన్నీ తప్పులేనని చెప్పారు. ఈ శ్వేతపత్రాన్ని ఏపీకి చెందిన ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారితో తయారు చేయించారని తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ప్రస్తుత ప్రభుత్వానికి అనుకూలంగా నివేదికను తయారు చేయించారని హరీష్ రావు ఆరోపించారు. అప్పులను రెవెన్యూతో పోల్చారు.. జీఎస్డీపీతో పోల్చలేదన్నారు. కరోనా కారణంగా ఎక్కువ అప్పులు తీసుకోవడానికి కేంద్రం అనుమతించింది. కేంద్ర ప్రభుత్వ వివక్ష వల్ల భారం పెరిగినప్పటికీ సంక్షేమ కార్యక్రమాలను ఆపలేదన్నారు హరీష్ రావు. లక్ష కోట్లు కేంద్రం నుంచి రానందువల్లే ఇబ్బంది కలిగిందని.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై తప్పుడు ప్రచారం చేయడం మానుకోవాలన్నారు. లేకపోతే రాష్ట్రానికి చెడ్డ పేరు వస్తుంది. పెట్టుబడులు కూడా ఆగిపోతాయని హెచ్చరించారు హరీష్ రావు. అప్పులు తీసుకున్న రాష్ట్రాల జాబితాలో కింద నుంచి ఐదో స్థానంలో తెలంగాణ ఉందని గుర్తు చేశారు హరీష్ రావు.

అప్పులకు అనుగుణంగా ఆస్తులు సృష్టించలేదనడం అబద్ధమన్నారు హరీష్ రావు. గత ప్రభుత్వం ఏం చేయలేదని చెప్పే తప్పుడు ప్రయత్నం ఇదని.. రూ.72 వేల కోట్లు రైతుబంధు కింద రైతులకు ఇచ్చామన్నారు. రాజకీయ లబ్ధి కోసం రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చే ప్రయత్నం చేస్తున్నారన్నారు. శ్వేతపత్రంలో చూపించిన లెక్కలు తప్పని అన్నారు. ఈ నివేదికలో కరోనా ఏడాది లెక్కలు చూపించారు.. ఆదాయం, ఆస్తులు ఎలా పెరిగాయో సరిగా లెక్కలు చూపలేదన్నారు. అప్పులు పెరిగాయంటూ బురదచల్లే ప్రయత్నం తప్ప మరేమీ కాదన్నారు హరీష్ రావు.


Full View



Tags:    

Similar News