Miss World : నేడు మిస్ వరల్డ్ పోటీల గ్రాండ్ ఫినాలే

హైదరాబాద్ లో నేడు మిస్ వరల్డ్ పోటీలు గ్రాండ్ ఫినాలే జరగనుంది

Update: 2025-05-31 01:59 GMT

హైదరాబాద్ లో నేడు మిస్ వరల్డ్ పోటీలు గ్రాండ్ ఫినాలే జరగనుంది. ప్రపంచ సుందరి ఎవరన్నది నేడు తెలియనుంది. హైదరాబాద్ లోని హైటెక్స్ లో ప్రారంభమయ్యే ఈ మిస్ వరల్డ్ పోటీలలో విజేతకు 8.5 కోట్ల రూపాయల నగదు బహుమతి ఇవ్వనున్నారు. దీంతో పటు 1,770 వజ్రాలతో కూడిన బంగారు కిరీటాన్ని కూడా సొంతం చేసుకోనున్నారు. దీంతో పాటు మిస్ వరల్డ్ బ్రాండ్ అంబాసిడర్ హోదాలో ఏడాది పాటు ప్రపంచమంతా ఉచితంగా పర్యటించే వెసులుబాటు ఉంది. ఇక ప్రకటనలు, సినిమా అవకాశాలు సరే సరి.

మే పదిన ప్రారంభమై...
ప్రపంచ సుందరి పోటీలు హైదరాబాద్ లోని గచ్చి బౌలి స్టేడియంలో మే 10వ తేదీన ప్రారంభమయ్యాయి. మే 31వ తేదీతో ముగియనున్నాయి. మొత్తం 108 దేశాలకు చెందిన సుందరీమణులు రాగా, పోటీలు నిర్వహించి క్వార్టర్ ఫైనల్స్ నలభై మందిని ఎంపిక చేశారు. అందులో పదహారు మందిని తిరిగి ఎంపిక చేశారు. తుదిపోటీల్లో నలభై మందిలో పోటీలకు ముందు ఇరవై నాలుగు మందిని ప్రకటిస్తారు. అనంతరం ఒక్కొక్క విభాగం నుంచి ఇద్దరు చొప్పున ఎనిమిది మందిని ఎంపిక చేసి చివరకు ఒకరిని ఎంపిక చేస్తారు. హైటెక్స్ లో భారీ బందోబస్తు మధ్య ఈ పోటీలను నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు రాజకీయ, సినీ ప్రముఖులు హాజరు కానున్నారు. పాస్ ఉన్నవారినే అనుమతిస్తారు.


Tags:    

Similar News