Telangana : నేడు గవర్నర్ ప్రసంగం.. ఆ తర్వాత బీఏసీ కూడా
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలలో నేడు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్ ప్రసంగిస్తారు
telangana assembly today
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేడు రెండో రోజు ప్రారంభం కానున్నాయి. ఈరోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్ ప్రసంగించనున్నారు. గవర్నర్ ప్రసంగం తర్వాత సభ వాయిదా పడుతుంది. గవర్నర్ ప్రసంగంలో గత ప్రభుత్వం చేసిన అప్పులపై ఎక్కువగా ప్రస్తుతం ప్రభుత్వం ఫోకస్ పెట్టేందుకు అవకాశముంది.
నేడు బీఏసీ మీటింగ్...
గవర్నర్ ప్రసంగానికి ప్రతిపక్ష నేతలు అడ్డుతగిలే అవకాశముంది. తమ నిరసనను తెలియచేయాలని బీఆర్ఎస్ నిర్ణయించుకున్నట్లు తెలిసింది. గవర్నర్ ప్రసంగం పూర్తి అయిన వెంటనే బిజినెస్ అడ్వయిజరీ కమిటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలతో పాటు సభ ఎన్ని రోజులు నిర్వహించాలన్నది నిర్ణయించనున్నారు.