రాజ్ భవన్ ప్రగతి భవన్ లా కాదు..తమిళి సై తీవ్ర వ్యాఖ్యలు

బిల్లుల్ని సమగ్రంగా పరిశీలించేందుకే సమయం తీసుకున్నానని గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్ అన్నారు

Update: 2022-11-09 11:36 GMT

బిల్లుల్ని సమగ్రంగా పరిశీలించేందుకే సమయం తీసుకున్నానని గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్ అన్నారు. ఒక్కొక్క బిల్లును కూలంకషంగా పరిశీలిస్తున్నానని తెలిపారు. కామన్ రిక్రూట్ మెంట్ బోర్డుకు తొలి ప్రాధాన్యత ఇచ్చానని గవర్నర్ తెలపిరాు. ఒక బోర్డు ఉండగా కొత్తగా ఇంకొక బోర్డు ఎందుకని తాను ఆలోచించానని అన్నారు. బిల్లుల్ని ఆపానని తనను తప్పుగా అర్థం చేసుకున్నారని తమిళిసై అన్నారు. ఆమె రాజ్ భవన్ లో మీడియాతో మాట్లాడారు. ఫాంహౌస్ కేసులోనూ రాజ్ భవన్ ను లాగాలని చూశారన్నారు. తుషార్ గతంలో ఏడీసీీగా పనిచేశారన్నారు. తుషార్ ను ఇందులో లాగడానికి ప్రయత్నించారని అన్నారు. రాజ్ భవన్ కు ఎవరొచ్చినా అభ్యంతరం లేదన్నారు. రాజ్ భవన్ ప్రగతి భవన్ కాదని తెలిపారు. రాజ్ భవన్ ముందు జేఏసీ ఆందోళనలు చేస్తానని పిలుపునిచ్చిందని, వారిని ఎవరు రెచ్చగొడుతున్నారో తెలుసునని తమిళిసై ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ఈ ప్రశ్నలకు ...?
వర్సిటీలో కామన్ రిక్రూట్ మెంట్ బోర్డుపై యూజీసీ అభిప్రాయాన్ని కూడా తాను తీసుకునేందుకు ప్రయత్నించానని చెప్పారు. బిల్లుల్ని తాను ఇంకెందుకో ఆపానని ప్రచారం చ ేస్తున్నారని గవర్నర్ అన్నారు. కొత్తగా రిక్రూట్ మెంట్ బోర్డు ఎందుకని అని ఆమె ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. యూజీసీ నిబంధనలకు లోబడి బోర్డు ఉంటుందా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బోర్డు ఏర్పాటులో ఎలాంటి ప్రొటోకాల్ పాటిస్తారని పర్వ్నించారు. చట్టపరంగా ఇబ్బందులు వస్తే పరిస్థితులు ఏంటని ఆమె అన్నారు. తాను లేఖ రాసినా మంత్రి తనకు సమాచారం అందలేదని చెప్పడం ఆశ్చర్యం కలిగించిందన్నారు. ఈ ప్రశ్నలన్నింటికీ తనకు సమాధానం కావాలని గవర్నర్ తమిళిసై అన్నారు.


Tags:    

Similar News