తెలంగాణలో ఆర్టీసీ బాదుడుకు రెడీ

తెలంగాణలో ఆర్టీసీ ఛార్జీలను పెంచేందుకు ప్రభుత్వం సిద్ధమయింది. ఆర్టీసీ నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రతిపాదనలు అందాయి.

Update: 2021-12-01 07:21 GMT

తెలంగాణలో ఆర్టీసీ ఛార్జీలను పెంచేందుకు ప్రభుత్వం సిద్ధమయింది. ఇప్పటికే ఆర్టీసీ నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రతిపాదనలు అందాయి. ఆయన ఓకే అంటే తెలంగాణలో ఆర్టీసీ ఛార్జీలు పెరిగినట్లే. రెండేళ్ల క్రితం ప్రభుత్వం ఆర్టీసీ ఛార్జీలను పెంచింది. కిలోమీటరకు ఇరవై పైసలు చొప్పున పెంచింది. గత కొద్ది రోజులుగా డీజిల్ ధరలు పెరుగుతున్నా కరోనా పరిస్థితుల దృష్ట్యా ఆర్టీసీ ఛార్జీలను ప్రభుత్వం పెంచలేదు.

పెరిగేది ఇలా....
అయితే ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ కు పంపిన ప్రతిపాదనల ప్రకారం పల్లె వెలుగు సర్వీసులకు కిలోమీటరుకు 25 పైసలు, ఎక్స్ ప్రెస్ బస్సులకు 30 పైసలు, ఇతర సర్వీసులకు 30 పైసలు పెంచనున్నట్లు తెలిసింది. ప్రభుత్వం నుంచి అంగీకారం వచ్చిన వెంటనే ఆర్టీసీ ఛార్జిలు పెంచుతామని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మీడియాకు వివరించారు.


Tags:    

Similar News