Telangana : స్థానికసంస్థల సమరానికి సిద్ధంగానే ఉన్నాం

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. పంచాయతీ రాజ్ శాఖ ఇప్పటికే అన్ని రకాలుగా సిద్ధమవుతుంది

Update: 2025-07-27 02:55 GMT

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. పంచాయతీ రాజ్ శాఖ ఇప్పటికే అన్ని రకాలుగా సిద్ధమవుతుంది. తెలంగాణలో ఎంపీటీసీ, జడ్పీటీసీ, గ్రామ పంచాయతి ఎన్నికలను రెండు దశల్లో నిర్వహించాలని పంచాయతి రాజ్ శాఖ నిర్ణయించింది. ఈ మేరకు ఎన్నికల సంఘానికి ప్రతిపాదన పంపింది.

రెండు దశల్లోనే...
గతంలో స్థానిక సంస్థల ఎన్నికలుమూడు దశల్లో జరిగాయని, ఈ సారి రెండు దశల్లోనే ఎన్నికలను నిర్వహించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఎన్నికల సంఘానికి పంచాయతీరాజ్ శాఖ తెలిపింది. బ్యాలెట్ బాక్సులను కూడా సిద్ధం చేసుకుంటున్నామని, ఇంకా అవసరమని భావిస్తే ఎన్నికల సంఘానికి లేఖలు రాయాలని పంచాయతీ రాజ్ శాఖ జిల్లాలోని సీఈఓలకు, డీపీఓలకు ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల సిబ్బంది విధులతో పాటు పోలింగ్ కేంద్రాల ఎంపికను కూడా చేయాలని సూచించింది.


Tags:    

Similar News