Telangana : విద్యార్థులకు తీపికబురు.. ఎల్లుండి నుంచే
తెలంగాణలో తీవ్రమవుతున్న ఎండలతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాఠశాలలకు ఒక పూట నిర్వహించాలని నిర్ణయించింది
తెలంగాణలో తీవ్రమవుతున్న ఎండలతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాఠశాలలకు ఒక పూట నిర్వహించాలని నిర్ణయించింది. మార్చి 15వ తేదీ నుంచి ఒంటిపూట బడులు ప్రారంభమవుతాయని పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రవేటు సంస్థలకు చెందిన ప్రాధమిక, ప్రధమికోన్నత , ఉన్నత పాఠశాలలు ఎల్లుండి నుంచి అంటే శనివారం నుంచి ఒంటిపూట ప్రారంభమవుతాయి. మార్చి పది హేనో తేదీ నుంచి ఏప్రిల్ 23 వతేదీ వరకూ ఈ ఒక పూట బడులు నిర్వహిస్తారు.
ఉదయం ఎనిమిది గంటల నుంచి...
ఈ నెల 15వతేదీ నుంచి ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభయ్యే విద్యాసంస్థలు మధ్యాహ్నం 12.30 గంటల వరకూ మాత్రమే పనిచేయాలని తెలిపారు. విద్యార్థులకు మధ్యాహ్న భోజనం 12.30 గంటలకు అందించాలని కూడా ప్రాధమిక విద్యాశాఖ జారీ చేసిన ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొంది. అలాగే పదో తరగతిపరీక్షలకు ప్రత్యేక తరగతులను కొనసాగుతాయని ఆదేశాల్లో పేర్కొన్నారు.