Breaking: సింగరేణి కార్మికులకు...గుడ్ న్యూస్ .. భారీగా బోనస్.. ఎంతో తెలిస్తే?

సింగరేణి కార్మికులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. దసరా బోనస్ ను భారీగా ప్రకటించింది.

Update: 2025-09-22 07:10 GMT

సింగరేణి కార్మికులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. దసరా బోనస్ ను భారీగా ప్రకటించింది. సింగరేణి కార్మికులకు లాభాల్లో వాటాను ఇచ్చే సంప్రదాయన్ని కొనసాగిస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. సింగరేణి గనులను 2,300 కోట్ల రూపాయల లాభాల్లో 34 శాతం వాటాలను బోనస్ గా ప్రకటించనున్నట్లు తెలిపారు. 34 శాతం ద్వారా వచ్చే నగదును సింగరేణి సంస్థలో ఉన్న 41 వేల కార్మికులతో పాటు కాంట్రాక్టు కార్మికులకు కూడా ఇస్తున్నట్లు ప్రకటించారు. ఒక్కొక్క కార్మిక కుటుంబానికి 1,95,610 లక్షల రూపాయలు బోనస్ గా అభిస్తుంది.

ప్రతి కుటుంబానికి...
ముప్ఫయి వేల మంది కాంట్రాక్టు కార్మికులకు ప్రతి కుటుంబానికి 5,500 రూపాయలు ఇస్తామని, మొత్తం 810 కోట్ల రూపాయలను దసరాగా బోనస్ ఇస్తామని చెప్పారు. దీపావళికి ప్రత్యేకంగా మరోసారి బోనస్ ను ప్రకటిస్తామని మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. సింగరేణి కార్మికుల పిల్లలకు ప్రభుత్వం ఉచిత విద్యను అందిస్తుందని తెలిపారు. ప్రయివేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిన రెండు బ్లాక్ లను తిరిగి స్వాధీనం చేసుకుంటామని మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. కోల్ ఇండియాలో కూడా లేని అలవెన్స్ ల ను సింగరేణి కార్మికులకు ఇస్తున్నామని తెలిపారు. వందేళ్లకు పైబడి ఉన్న సింగరేణి కార్మికులకు ప్రభుత్వం చేయూత ఇస్తుందని తెలిపారు.


Tags:    

Similar News