Telangana : నేడే ఆఖరి గడువు.. వివరాలు పంపాల్సిందే

రిటైర్ అయి వివిధ హోదాల్లో పనిచేస్తున్న వారి వివరాలను ప్రభుత్వం కోరింది. ఈ సాయంత్రంలోగా నివేదికను సమర్పించాలని కోరింది

Update: 2024-01-17 02:00 GMT

government has asked for the details of those who have retired and are working in various positions in telangana

రిటైర్ అయి వివిధ హోదాల్లో పనిచేస్తున్న వారి వివరాలను ప్రభుత్వం కోరింది. ఈరోజు సాయంత్రంలోగా నివేదికను సమర్పించాలని అన్ని శాఖల అధికారులను ఆదేశించింది. రిటైరైన తర్వాత గత ప్రభుత్వం అనేక మంది అధికారులను విధుల్లో కొనసాగించడంతో పాటు మరికొందరికి ముఖ్యమైన పదవులను కట్టబెట్టడాన్ని గుర్తించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ చర్యలకు దిగింది.

రిటైర్ అయిన ఉద్యోగుల వివరాలను...
రిటైర్ అయిన తర్వాత ఉద్యోగులను అవుట్ సోర్సింగ్ పద్ధతిలో తీసుకున్న వారి జాబితాను పంపాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. ఇప్పటికీ అనేక శాఖల్లో పదవీ విరమణ పొందిన వారు పనిచేస్తుండటాన్ని గుర్తించిన ప్రభుత్వం వారిని తొలగించే ప్రక్రియను చేపట్టనుంది. ముఖ్యంగా విద్యుత్తు, నీటిపారుదల శాఖల్లో ఈ రకమైన నియామకాలున్నట్లు గుర్తించి ఈరోజు సాయంత్రంలోగా వారి వివరాలను పంపాలని ఆదేశాలు జారీ చేసింది.


Tags:    

Similar News