Raja Singh : సొంత పార్టీ నేతలకు రాజాసింగ్ వార్నింగ్

గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన ప్రత్యర్థులకు వార్నింగ్ ఇచ్చారు

Update: 2025-06-12 02:57 GMT

గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన ప్రత్యర్థులకు వార్నింగ్ ఇచ్చారు. పార్టీలో తనను వేధించేవారిని వదిలిపెట్టబోనని హెచ్చరించారు. పార్టీలో తనను కొందరు ఇబ్బంది పెడుతున్నారని, పార్టీ కోసం తాను ఎంతగానో శ్రమిస్తున్నా తనను ఇబ్బంది పెట్టేవారు కొందరున్నారని, వారిని మాత్రం తాను వదిలిపెట్టేది లేదని రాజాసింగ్ వార్నింగ్ ఇచ్చారు.

బీజేపీలోనే ఉంటానని.
తాను బీజేపీలో జీవితాంతం ఉంటానని, పార్టీని వదిలే ప్రసక్తి లేదని రాజాసింగ్ తెలిపారు. తాను రాజకీయాలకు దూరమైనా బీజేపీ జెండాను వదలనన్న రాజాసింగ్ తన మొదటి పార్టీ టీడీపీ, చివరి పార్టీ బీజేపీ అని ఆయన అన్నారు. తనను అనవసరంగా వివాదాల్లోకి లాగేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని, పార్టీ ఏం చర్యలు తీసుకున్నా తాను సిద్ధమేనని ప్రకటించారు.


Tags:    

Similar News