Telangana : గ్రూప్ వన్ మెయిన్స్ రిజల్ట్ తేదీ అప్పుడేనట

తెలంగాణ గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షలకు గుడ్ న్యూస్. పరీక్ష

Update: 2025-02-21 08:00 GMT

తెలంగాణ గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షలకు గుడ్ న్యూస్. పరీక్ష ఫలితాలు త్వరలోనే ప్రకటించేందుకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సిద్ధం చేస్తుంది. గత ఏడాది అక్టోబరు 21 నుంచి అక్టోబరు 27వ తేదీ వరకూ గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షలు జరిగాయి. మొత్తం 21,093 మంది అభ్యర్థుల ఈ పరీక్షలకు హాజరయ్యారు. అయితే ప్రస్తుతం జవాబు పత్రాలను దిద్దడం పూర్తయిందని అధికారులు చెబుతున్నారు.

మార్కుల ఆధారంగా...
ఈ పరీక్షల్లో అభ్యర్థులు సాధించే మార్కుల ఆధారంగా మెరిట్ లిస్ట్ ను త్వరలో విడుదల చేయడానికి టీజీపీఎస్సీ అన్ని రకాలుగా సన్నాహాలు చేస్తుంది. మార్కుల ఆధారంగా 1:2 నిష్పత్తిలో ఎంపిక విధానం ఉంటుందని సమాచారం. మెరిట్ జాబితాను వచ్చే నెల మొదటి లేదా రెండో వారంలో విడుదల చేసేందుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నారు.


Tags:    

Similar News