10వ తరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్

పరీక్ష సమయాన్ని మరో 30 నిమిషాల పాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. సాధారణంగా 2 గంటల 45 నిమిషాలున్న పరీక్ష సమయాన్ని..

Update: 2022-04-08 11:44 GMT

హైదరాబాద్ : మే నెలలో తెలంగాణలో 10వ తరగతి విద్యార్థులకు పరీక్షలు జరగనున్నాయి. కరోనా కారణంగా.. రెండేళ్లుగా విద్యార్థులు పరీక్షలకు దూరమయ్యారు. ఇంటిపట్టునే ఉండి.. ఆన్లైన్ క్లాసులు అర్థమయ్యీ కాక సతమతమయ్యారు. ఈ విద్యాసంవత్సరం కరోనా కాస్త శాంతించడంతో ఆఫ్ లైన్ క్లాసులతో విద్యార్థులకు కాస్త ఊరట లభించింది. తాజాగా తెలంగాణ 10వ తరగతి విద్యార్థులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం.

పరీక్ష సమయాన్ని మరో 30 నిమిషాల పాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. సాధారణంగా 2 గంటల 45 నిమిషాలున్న పరీక్ష సమయాన్ని మరో 30 నిమిషాలు పెంచి, 3 గంటల 15 నిమిషాలు చేసింది. ఈ విషయాన్ని విద్యాశాఖమంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. 70 శాతం సిలబస్ నే పరీక్షల్లో అమలు చేస్తున్నామని, ఛాయిస్ కూడా ఎక్కువగానే ఇస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది 5 లక్షలకు పైగా టెన్త్ విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు ఆమె వివరించారు.


Tags:    

Similar News