మహిళలకు బ్యాడ్ న్యూస్.. పసిడి రేట్లు పెరిగాయి

దేశంలో బంగారం ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. ఒకరోజు తగ్గి మరొకరోజు పెరుగుతూ వినియోగదారులను ఆలోచనలో పడేస్తున్నాయి.

Update: 2021-11-19 01:38 GMT

దేశంలో బంగారం ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. ఒకరోజు తగ్గి మరొకరోజు పెరుగుతూ వినియోగదారులను ఆలోచనలో పడేస్తున్నాయి. బంగారం కొనుగోలుకు ఇది సరైన సమయమా? కదా? అన్నది తేల్చుకోలేని పరిస్థితులు ఉన్నాయి. పెళ్లిళ్ల సీజన్ కావడంతో కొందరు తప్పనిసరిగా బంగారం కొనుగోలు చేయాల్సిన పరిస్థితి. రోజురోజుకూ బంగారం ధరలు పెరుగుతుండటంతో కొందరు కొనుగోలును వాయిదా వేసుకుంటున్నారు.

ధరలు ఇలా....
హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో ఈరోజు బంగారం ధరలు ఇలా ఉన్నాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర వంద రూపాయలు పెరిగి 46,000లకు చేరుకుంది. 24 క్యారెట్ల బంగారం ధర 110 లకు పెరిగింది. దాని 50,180గా ఉంది. వెండి ధరలు కూడా పెరుగుతున్నాయి. కిలో వెండి 400 పెరిగింది. ప్రస్తుతం కిలో వెండి 71,400లుగా ఉంది.


Tags:    

Similar News