యాదాద్రి భువనగిరి జిల్లా.. అండర్ వేర్ లో బంగారాన్ని దాచేసారు

Update: 2022-10-30 05:39 GMT

యాదాద్రి భువనగిరి జిల్లాలో భారీగా బంగారం పట్టుబడింది. చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ గేట్ దగ్గర భారీగా బంగారాన్ని పోలీసులు పట్టుకున్నారు. విజయవాడ నుంచి హైదరాబాద్ కారులో ప్రయాణీస్తున్న ముగ్గురి నుంచి మూడున్నర కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు. నిందితులను సుల్తానా, షరీఫ్ జావేద్ లుగా గుర్తించారు. దుబాయ్ నుంచి గన్నవరం ఎయిర్ పోర్టులో ఫైట్ దిగి హైదరాబాద్ కు తరలిస్తుండగా పట్టుకున్నారు పోలీసులు. అండర్ వేర్ లో బంగారాన్ని పెట్టుకుని అక్రమంగా తరలిస్తుండగా పోలీసులు తనిఖీలు చేసి పట్టుకున్నారు. మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో వాహనాలను పోలీసులు జల్లెడ పడుతున్నారు. చౌటుప్పల్ మండలం పంతంగి వద్ద కారును ఆపి తనిఖీ చేయగా నిందితులు అనుమానాస్పదంగా కనిపించారు. అనుమానం వచ్చి తనిఖీలు చేయగా కారులో అక్రమంగా తరలిస్తున్న గోల్డ్ ను స్వాధీనం చేసుకున్నారు.

శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో శుక్రవారం విదేశాల నుంచి అక్రమంగా తీసుకొస్తున్న బంగారాన్ని కస్టమ్స్‌ అధికారులు పట్టుకున్నారు. దుబాయ్‌ నుంచి శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న ప్రయాణికుడిని తనిఖీ చేయగా అతని చెప్పుల్లో పేస్టురూపంలో 228గ్రాముల బంగారం ఉన్నట్లు గుర్తించారు. దీనివిలువ రూ.11లక్షల 90వేలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. బంగారాన్ని స్వాధీనం చేసుకొని నిందితుడిని అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


Tags:    

Similar News