18 ఏళ్ల తర్వాత జులై లో తెరుచుకున్న సాగర్ గేట్లు
18 ఏళ్ల తర్వాత జులై లో నాగార్జున సాగర్ గేట్లు తెరుచుకున్నాయి.
నాగార్జున సాగర్ గేట్లు తెరుచుకున్నాయి. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు శ్రీశైలం నిండి ఇటు నాగార్జున సాగర్ లో కూడా నీటి మట్టం పెరిగింది. శ్రీశైలం ఐదు గేట్లను ఎత్తివేసి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. కాగా సాగర్ గరిష్ట నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుత నీటి మట్టం 584.41 అడుగులకు చేరుకుంది.
మంత్రులు ఉత్తమ్, అడ్లూరి...
నాగార్జున సాగర్ గరిష్ట నిల్వ సామర్థ్యం 312.50 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటి నిల్వ 295.7 టీఎంసీలకు చేరింది. దీంతో ఈరోజు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ లు నాగార్జున సాగర్ గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రస్తుతం సాగర్ లో విద్యుత్ ఉత్పత్తి ద్వారా 28,785 క్యూసెక్కులను తెలంగాణ దిగువకు విడుదల చేసింది. పద్దెనిమిదేళ్ల తర్వాత జులై లో నాగార్జున సాగర్ గేట్లు తెరుచుకున్నాయి.