థర్డ్ వేవ్ తోనే కరోనా ముగిసిపోలేదు.. మరిన్ని వేరియంట్లు రాబోతున్నాయ్ !

థర్డ్ వేవ్ తోనే కరోనా సమస్య ముగిసిపోలేదని.. మరిన్ని వేరియంట్లతో దాడి చేసేందుకు సిద్ధంగా ఉందని హెచ్చరించారు. ప్రస్తుతం

Update: 2022-01-29 09:59 GMT

దేశంలో చాలా రోజుల తర్వాత రోజువారీ కేసుల్లో తగ్గుదల కనిపించింది. కానీ.. మరణాల రేటు మాత్రం పెరుగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో కరోనా ఉద్ధృతి కనిపిస్తోంది. ఏపీలో ప్రతిరోజూ 10 వేలకు పైగా కేసులు నమోదవుతుండగా.. తెలంగాణలో రోజువారీ కేసులు 3 వేలకు పైగానే నమోదవుతున్నాయి. ఓవైపు ఒమిక్రాన్.. మరోవైపు డెల్టా వేరియంట్ తో రాష్ట్రంలో థర్డ్ వేవ్ ప్రభావం తీవ్రంగానే కనిపిస్తోంది. ప్రతినిత్యం వేలల్లో నమోదవుతున్న పాజిటివ్ కేసులు.. ప్రజల్లో ఆందోళన పెంచుతున్నారు. ఈ నేపథ్యంలో గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు కరోనా పై షాకింగ్ కామెంట్స్ చేశారు.

థర్డ్ వేవ్ తోనే కరోనా సమస్య ముగిసిపోలేదని.. మరిన్ని వేరియంట్లతో దాడి చేసేందుకు సిద్ధంగా ఉందని హెచ్చరించారు. ప్రస్తుతం రాష్ట్రంలో నమోదవుతున్న కేసుల్లో 95 శాతం కేసులు ఒమిక్రాన్ వేరియంటేనని, 5 శాతం మాత్రమే డెల్టా కేసులను రాజారావు వివరించారు. గాంధీ ఆస్పత్రిలో ప్రస్తుతం 173 మంది కరోనా పేషెంట్లు చికిత్స తీసుకుంటుండగా.. 169 మంది ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు. మరో నలుగురి పరిస్థితి సీరియస్ గా ఉందని తెలిపారు. ఇంట్లో ఒకరికి కరోనా వస్తే.. అందరూ దాని బారిన పడుతున్నారని.. ఇప్పుడున్న వేరియంట్లతో చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు.


Tags:    

Similar News