Telangana : నేడు మేడారానికి నలుగురు మంత్రులు

నేడు మేడారానికి నలుగురు తెలంగాణ మంత్రులు బయలుదేరి వెళుతున్నారు.

Update: 2025-11-12 02:40 GMT

నేడు మేడారానికి నలుగురు తెలంగాణ మంత్రులు బయలుదేరి వెళుతున్నారు. మేడారం జాతరకు సంబంధించిన అభివృద్ధి పనులపై మంత్రులు సమీక్ష జరపనున్నారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాసులురెడ్డి, కొండా సురేఖ, సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ లు నేడు మేడారం పర్యటనకు వస్తున్నారు. అధికారులతో సమావేశం కానున్నారు. పనుల పురోగతిని పరిశీలించనున్నారు.

మేడారం జాతర అభివృద్ధి పనులకు...
మేడారం జాతర నేపథ్యంలో ఇప్పటికే అభివృద్ధి పనులకు రాష్ట్ర ప్రభుత్వం వంద కోట్ల రూపాయలకు పైగా కేటాయించింది. పనులను కూడా కాంట్రాక్టు సంస్థలకు అప్పగించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడారం జాతరకు ముందు అన్ని రకాలుగా అభివృద్ధిపనులు చేసి భక్తులకు ఇబ్బందులు లేకుండా చేయాలని ఆదేశించడంతో నేడు మంత్రులు మేడారానికి చేరుకుని పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు.


Tags:    

Similar News