ప్రభాకర్ రావును విచారిస్తున్న సిట్ అధికారులు
ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావును స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీం విచారిస్తుంది.
ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావును స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీం విచారిస్తుంది. గత కొద్ది గంటలుగా ఆయనను అధికారులు అన్ని కోణాల్లో విచారిస్తున్నారు. ఫోన ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడిగా ఉన్న ప్రభాకర్ రావు పదిహేను నెలల తర్వాత సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నిన్న రాత్రి అమెరికా నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. ఈరోజు ఉదయం సిట్ ఎదుటకు హాజరయ్యారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో...
ఫోన్ ట్యాపింగ్ కేసులో జరిగిన అంశాలపై సిట్ అధికారుల ప్రభాకర్ రావును ప్రశ్నిస్తున్నట్లు తెలిసింది. ఆయనను ఆగస్టు 5వ తేదీ వరకూ అరెస్ట్ చేసే అవకాశం లేదు. ఈ కేసును ఆగస్టు 5వ తేదీకి వాయిదా వేయడంతో అప్పటి వరకూ ప్రభాకర్ రావును అరెస్ట్ చేయకూడదన్న కారణంగా ఈరోజు సిట్ అధికారులు విచారించి వదిలేయనున్నారు. మరొకసారి విచారణకు పిలిచే అవకాశముందని తెలిసింది. సాయంత్రం వరకూ ప్రభాకర్ రావును సిట్ అధికారులు విచారించే అవకాశముంది.