నేడు కేసీఆర్ ను కలవనున్న కుమారస్వామి

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను నేడు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి కలవనున్నారు

Update: 2022-09-11 04:24 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను నేడు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి కలవనున్నారు. ఆయన హైదరాబాద్ కు వచ్చి కేసీఆర్ తో ప్రత్యేంకగా సమావేశం కానున్నారు. ఉదయం 11 గంటలకు కుమారస్వామి రానున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఆయన సాయంత్రం వరకూ ప్రగతి భవన్ లోనే ఉండి కేసీఆర్ తో చర్చలు జరుపుతారని చెప్పారు.

జాతీయ రాజకీయాల్లో...
జాతీయ రాజకీయాల్లో ముఖ్య భూమిక పోషించాలనుకుంటున్న కేసీఆర్ బీజేపీయేతర పార్టీల అధినేతలను వరసగా కలుస్తున్న సంగతి తెలిసిందే. దక్షిణ భారతదేశంలో బీజేపీ బలంగా ఉన్న రాష్ట్రం కర్ణాటక మాత్రమే. ఆ తర్వాత ఇప్పుడిప్పుడే తెలంగాణలో బీజేపీ కొంత బలపడుతుంది. ఈ నేపథ్యంలో వీరిద్దరి కలయిక రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. ఇద్దరి మధ్య రాజకీయ అంశాలతో పాటు ఆ యా రాష్ట్రాల్లో బీజేపీని దెబ్బతీయడానికి కావాల్సిన వ్యూహాల గురించి చర్చిస్తారని తెలిసింది. కుమారస్వామితో భేటీ తర్వాత త్వరలోనే హైదరాబాద్ వేదికగా కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటన ఉంటుందని తెలిసింది. కొత్తగా జాతీయ పార్టీ పెట్టాలంటూ 22 టీఆర్ఎస్ జిల్లా కమిటీల అధ్యక్షులు తీర్మానం చేసిన సంగతి తెలిసిిందే.


Tags:    

Similar News