KCR : కేసీఆర్ కు అస్వస్థత.. యశోద ఆసుపత్రిలో చేరిక

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అస్వస్థతకు గురయ్యారు. ఆయన సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు

Update: 2025-07-03 13:06 GMT

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అస్వస్థతకు గురయ్యారు. ఆయన సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. ఆయనకు వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించారు. గత కొద్ది రోజులుగా కేసీఆర్ వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నారని తెలిసింది. సీజనల్ ఫీవర్ తో బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

వైద్య పరీక్షలను ...
కేసీఆర్ కు అన్ని రకాల టెస్ట్ లను చేస్తున్నారు. ఫీవర్ కంట్రోల్ కి రావడానికి వైద్యులు ప్రయత్నిస్తున్నారు. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో ఉన్న కేసీఆర్ కు గత కొంతకాలంగా ఫీవర్ తో బాధపడుతుండటంతో ఆయనను వెంటనే యశోద ఆసుపత్రికి తీసుకు వచ్చారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, ఫీవర్ తగ్గిన తర్వాత వైద్య పరీక్షలకు సంబంధించి రిపోర్టులను చూసిన తర్వాత డిశ్చార్జ్ చేస్తామని వైద్యులు తెలిపారు.


Tags:    

Similar News