Cloud Burst : తెలంగాణలో రెడ్ అలెర్ట్... మెదక్.. కామారెడ్డి జిల్లాల్లో క్లౌడ్ బరస్ట్

తెలంగాణలో మెరుపు వరదలు ప్రజలను భయభ్రాంతులకు గురిచేశాయి. మెదక్, కామారెడ్డి జిల్లాలపై ప్రభావం తీవ్రంగా ఉంది

Update: 2025-08-27 12:34 GMT

తెలంగాణలో మెరుపు వరదలు ప్రజలను భయభ్రాంతులకు గురిచేశాయి. మెదక్, కామారెడ్డి జిల్లాలపై ప్రభావం తీవ్రంగా ఉంది. అనేక ఇళ్లలోకి వరద నీరు చేరింది. అల్పపీడన ప్రభావంతో మరో పన్నెండు గంటల పాటు అతి భారీ వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో ప్రభుత్వం అప్రమత్తం మయింది. కామారెడ్డి జిల్లాలో 26 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది. లోయర్ మానేరు, అప్పర్ మానేరు, మిడ్ మానేరు ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కొందరు వరద నీటిలో చిక్కుకోవడంతో వారిని బయటకు తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేపడుతు్న్నారు. సిరిసిల్ల - కామారెడ్డి మధ్య రాకపోకలు బంద్ అయ్యాయి.

నదులు, వాగులు పొంగి...
అనేక నదులు, వాగులు, వంకలు పొంగి పొరలుతుండటంతో ఎటు చూసినా నీళ్లే కనిపిస్తున్నాయి. కామారెడ్డి, దోమకొండ, బికనూర్ లలో అనేక కాలనీలు నీట మునిగాయి. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలు కూడా తోడు కావడంతో నదులు మరింతగా పొంగి ప్రవహిస్తున్నారు. అప్పర్ మానేరు నుంచి ఒక్కసారిగా 70 వేల క్యూసెక్కుల నీరు విడుదల కావడంతో ఆ ప్రాంత ప్రజలు మొత్తం ఇబ్బందులు పడుతున్నారు. అక్కడ దేవాలయం వద్ద ప్రజలు తలదాచుకున్నారు. వారిని బయటకు తీసుకు వచ్చేందుకు అధికారులు తెస్తున్నారు. నిన్న రాత్రి పన్నెండు గంటలకు ప్రారంభమైన వర్షం ఇంకా పడుతూనే ఉండటంతో అనేక గ్రామాలు పొంగి పొరలు ప్రవహిస్తున్నాయి.
ఎవరూ బయటకు రావద్దంటూ...
మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అతి భారీ వర్షం కురవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సహాయక చర్యలు చేపట్టాలన్నా అక్కడకు ఎవరూ వెళ్లలేని పరిస్థితి నెలకొంది. కందికుంట చెరువు కూడా పొంగి ప్రవహిసంచి రోడ్డుపైకి చేరింది. మెదక్ లో అనేక కార్లు వరద నీటిలో కొట్టుకుపోయాయి. కొందరు ఉపాధ్యాయులు కూడా వర్షాల్లో చిక్కుకున్నారు. ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావద్దంటూ ఇప్పటికే అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. దీంతో ముఖ్యమంత్రితో పాటు మంత్రులు నిత్యం అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. వరదల్లో చిక్కుకుపోయిన ప్రజలను బయటకు తీసుకు వచ్చేందుకు అధికారులు ప్రయత్నిస్తున్న నీరు సహకరించడం లేదు. మొత్తం మీద వరద నీటిలో కామారెడ్డి, మెదక్ జిల్లాల ప్రజలు ఈ రాత్రి గడిస్తే చాలు అని భయాందోళనలతోగడుపుతున్నారు.


Tags:    

Similar News