Cabinet : డిసెంబరు 9 నుంచి రెండు గ్యారంటీల అమలు

తెలంగాణ తొలి కేబినెట్ సమావేశం ముగిసింది. ఆరు గ్యారంటీలపై సుదీర్ఘంగా చర్చించామని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు.

Update: 2023-12-07 15:24 GMT

తెలంగాణ తొలి మంత్రి వర్గ సమావేశం ముగిసింది. ఆరు గ్యారంటీలపై మంత్రి వర్గ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించామని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మీడియాకు తెలిపారు. ఆరు గ్యారంటీలకు సంబంధించి నాడు సోనియా గాంధీ హామీ ఇచ్చారని, వాటిని అమలు చేసే దిశగా ఈ ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు. మార్పు కోరుకునే వారికి రాబోయే కాలంలో మార్పు ఏంటో చూపిస్తామని తెలిపారు. ప్రతి గ్యారంటీపైనా సుదీర్ఘంగా చర్చించి తొలి మంత్రి వర్గ సమావేశంలో రెండు గ్యారంటీలను అమలు చేయాలని నిర్ణయించామని తెలిపారు. తొలుత రెండు గ్యారంటీలను అమలు చేయాలని నిర్ణయించామన్నారు. ఒకటి మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం, రెండోది రాజీవ్ ఆరోగ్య శ్రీ పరిమితిని పది లక్షలకు పెంచుతూ ఇచ్చిన గ్యారంటీలు 9వ తేదీ నుంచి అమలులోకి వస్తాయని చెప్పారు.

సోనియా పుట్టినరోజు నాడు...
రేపు సుదీర్ఘంగా ముఖ్యమంత్రి ఆ యా శాఖలతో చర్చించి రెండు గ్యారంటీలను 9వ తేదీ నుంచి అమలు చేసే కార్యక్రమాన్ని తీసుకుంటామని తెలిపారు. సోనియా గాంధీ పుట్టిన రోజు సందర్భంగా గ్యారంటీలు రెండింటిని అమలు చేస్తామని తెలిపారు. విద్యుత్తుకు సంబంధించి 24 గంటలు సరఫరా ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు. 2014 నుంచి నేటి వరకూ వివిధ అంశాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని నిర్ణయించామని చెప్పారు.


Tags:    

Similar News