సిగ్గుపడుతున్నా: కేటీఆర్

తెలంగాణ శాసన సభ సమావేశాలను ప్రారంభిస్తూ గవర్నర్ తమిళిసై ప్రసంగం చేశారు. అసెంబ్లీ సమావేశాల

Update: 2023-12-16 07:24 GMT

ktr telangana assembly

తెలంగాణ శాసన సభ సమావేశాలను ప్రారంభిస్తూ గవర్నర్ తమిళిసై ప్రసంగం చేశారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించిన గవర్నర్ తమిళిసై సౌందర రాజన్.. రాచరిక పాలన నుంచి తెలంగాణ విముక్తి పొందిందని, ప్రజా పాలన మొదలైందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజాకవి కాళోజీ కవితతో ప్రసంగాన్ని ప్రారంభించిన గవర్నర్.. కొత్త ప్రభుత్వానికి, ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలకు అభినందనలు తెలిపారు. నిర్భందపు పాలన నుంచి ప్రజలు స్పష్టమైన తీర్పునిచ్చారన్నారు. రాష్ట్ర ఏర్పాటులో బలిదానాలు చేసిన వారి త్యాగాలను గుర్తించాలని కొత్త ప్రభుత్వానికి సూచించారు.

Full View



బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కేటీఆర్ గవర్నర్ ప్రసంగంపై మండిపడ్డారు. ఓ సభ్యుడిగా గవర్నర్ ప్రసంగం విని సిగ్గుపడ్డానని.. ఇలాంటి ప్రసంగం రాష్ట్ర శాసన సభ చరిత్రలోనే విని ఉండమని అన్నారు. వెయ్యి ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు బయలుదేరినట్టు చేయాల్సిన దారుణాలన్నీచేసి కేవలం పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేయించారని కాంగ్రెస్ పార్టీపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్ గారి దారుణమైన ప్రసంగం విన్నాక కాంగ్రెస్ పాలనలో రాబోయే రాష్ట్ర భవిష్యత్తు ఎలా ఉండబోతోందో స్పష్టంగా తెలిసిపోయిందని.. శాసన సభలో ప్రధాన ప్రతిపక్షంగా వాస్తవాలను ప్రజల ముందు పెట్టాల్సిన బాధ్యత తమకు ఉందని, తప్పకుండా నిజాలను బయటపెడతామని కేటీఆర్ తెలిపారు. అధికారంలో ఉన్నా లేకున్నా తాము ఎప్పటికీ ప్రజల పక్షమేనని, తెలంగాణకు ఎన్నటికీ స్వపక్షమేనన్నారు.


Tags:    

Similar News