Harish Rao : కాంగ్రెస్ నేతలది తప్పుడు ప్రచారం...అసలు వాస్తవాలివే
కాళేశ్వరం ప్రాజెక్టువల్లనే తెలంగాణలో బీడు భూములకు సాగు నీరు అందుతుందని మాజీ మంత్రి హరీశ్ రావు తెలిపారు
కాళేశ్వరం ప్రాజెక్టువల్లనే తెలంగాణలో బీడు భూములకు సాగు నీరు అందుతుందని మాజీ మంత్రి హరీశ్ రావు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఆయన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు కల్పతరువని హరీశ్ రావు తెలిపారు. మొత్తం ఇరవై లక్షలకు పైగా ఎకరాలకు సాగు నీరు అందుతుందని, కానీ కాంగ్రెస్ నేతలు మాత్రం ఒక్క ఎకరాకు కూడా సాగు నీరు అందలేదని అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు. తాము అధికారంలో ఉన్నప్పడు ఒక ఏడాది కరువు వస్తే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచినీళ్లను రివర్స్ పంపింగ్ చేసినట్లు కూడా హరీశ్ రావు తెలిపారు.
కాళేశ్వరం.. వరం...
మిడ్ మానేరు నుంచి ఎల్ఎండీకి నీళ్లు తెచ్చి అక్కడి నుంచి ఎస్సారెస్పీ స్టేజీ వన్ కు నీళ్లిచ్చామని హరీశ్ రావు వివరించారు. ఎస్సారెస్పీ స్టేజీ రెండులో తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడ వరకూ నీరిందించినట్లు హరీశ్ రావు గుర్తు చేశారు. కాళేశ్వరం నీటి వల్లనే అనేక పంటలను నాడు కాపాడిందని హరీశ్ రావు చెప్పుకొచ్చారు. అలాంటి కాళేశ్వరంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. యాభై ఎకరాలే పారిందని కాంగ్రెస్ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.