ఖమ్మంలో కాంగ్రెస్ బలంగా ఉంది

ఖమ్మం జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ ముందు నుండి బలంగా ఉంది. కమ్యూనిస్టులు బలంగా ఉన్న ఈ ప్రాంతంలో కాంగ్రెస్ కు కూడా మంచి పట్టు ఉంది. ఈ తరుణంలో పొంగులేటి వంటి బలమైన నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరితే మాత్రం బీఆర్ఎస్ కు చిక్కులు తప్పవు. కాంగ్రెస్ బలం కూడా తప్పకుండా పుంజుకుంటుంది.

Update: 2023-05-30 02:37 GMT

భారతీయ జనతా పార్టీ పార్టీ చేరికల కమిటీ అధ్యక్షుడు ఈటల రాజేందర్ ఇటీవల ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుతో రహస్యంగా భేటీ అయ్యారు. హైదరాబాద్ శివారులో ఓ ఫామ్ హౌస్ లో ఈ భేటీ జరిగింది. ఈటలతో పాటు ఇద్దరు ముఖ్యనేతలు తమ మొబైల్ ఫోన్లు, సొంత వాహనాలు, వ్యక్తి గత భద్రత సిబ్బందిని వదలిపెట్టి వేర్వేరు వాహనాల్లో ఓ ఫాంహౌస్ కు వెళ్లారు. బీజేపీ ముఖ్యనేతలతో పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి జూపల్లి దాదాపు రోజంతా సమావేశమై వివిధ సమీకరణాలు, చేరికలపై చర్చించినట్లు వార్తలు గుప్పుమన్నాయి. ఈ సీక్రెట్ ఆపరేషన్ కోసం బీజేపీ నేతలు కొత్త ఫోన్లు, సిమ్ లు ఉపయోగించారని కూడా తెలిసింది. ఈ భేటీ తర్వాత పొంగులేటి, జూపల్లి ఏ రాజకీయ పార్టీలోకి అడుగుపెడతారో తెలిసే అవకాశం ఉందని అనుకున్నారు. కానీ ఈ చర్చలు ఓ కొలిక్కి రాలేదని తేలిపోయింది. ఈటల రాజేందర్ నిత్యం పొంగులేటి, జూపల్లితో మాట్లాడుతూ ఉన్నారని తెలుస్తోంది. ఈటల చేసిన ప్రయత్నాలు బెడిసి కొట్టాయని అంటున్నారు.

తాను ప్రతిరోజు పొంగులేటి, జూపల్లితో మాట్లాడుతున్నానని, కానీ వారు బీజేపీలో చేరడం కష్టమేనని ఈటల రాజేందర్ చెప్పుకొచ్చారు. వారు తనకే రివర్స్ కౌన్సిలింగ్ ఇస్తున్నారని అన్నారు. ఇప్పటివరకు వారిని కాంగ్రెస్ లో చేరకుండా మాత్రమే ఆపగలిగానని ఈటల తెలిపారు. బీజేపీలో చేరడానికి వారికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయని తేల్చి చెప్పారు. ఖమ్మం జిల్లా సంప్రదాయకంగా కమ్యూ­నిస్టులకు, కాంగ్రెస్‌కు పట్టున్న జిల్లా అన్న విష­యం అందరికీ తెలిసిందేనని.. అయితే బీజేపీ­లో పొంగులేటి, జూపల్లి చేరడం కష్టమేనని తాను అన­ని మాటలను అన్నట్టుగా కొందరు ప్రచారం చేస్తు­న్నారని ఈటల అన్నారు. 
ఖమ్మం జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ ముందు నుండి బలంగా ఉంది. కమ్యూనిస్టులు బలంగా ఉన్న ఈ ప్రాంతంలో కాంగ్రెస్ కు కూడా మంచి పట్టు ఉంది. ఈ తరుణంలో పొంగులేటి వంటి బలమైన నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరితే మాత్రం బీఆర్ఎస్ కు చిక్కులు తప్పవు. కాంగ్రెస్ బలం కూడా తప్పకుండా పుంజుకుంటుంది.
 ప్రభుత్వం, అధికా­ర పార్టీ రాజకీయాలు, అధికారుల ఒత్తిళ్లను ఎదు­ర్కొ­ని మరీ ప్రజల అండదండలతో హుజూరా­బాద్‌­లో గెలవగలిగానన్నారు.
సీఎం కేసీఆర్‌ అమలు చేసే ట్రిక్స్‌ అన్నీ తన­కు తెలుసని.. ఎన్నికలు వచ్చినప్పుడు ఎలా వ్యవ­హరిస్తారో దగ్గరుండి చూశానని ఈటల రాజేందర్‌ అన్నారు. అన్ని పార్టీ­ల్లో­నూ కేసీఆర్‌ అడుగ­డుగునా కోవర్టులను పెట్టుకుని రాజకీయా­లు చేస్తున్నారని.. ఇటీవల వివిధ పార్టీల్లో చోటుచేసు­కున్న పరిణామాలు దీనిని రుజువు చేస్తున్నాయని అన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ను ప్రజలే ఓడించబోతున్నారన్నారు. కాంగ్రెస్‌ పార్టీని ఎలా డీల్‌ చేయాలో కేసీఆర్‌కు బాగా తెలుసని, గత ఎన్నికల్లోనూ అదే జరిగిందని ఈటల చెప్పారు. కాంగ్రెస్ ను గతంలో పుంజుకోనివ్వకుండా చేయడంలో కేసీఆర్ సక్సెస్ అయ్యారని తెలిపారు ఈటల.


Tags:    

Similar News