Telangana : 13 నుంచి తెలంగాణలో కళాశాలల బంద్

తెలంగాణలో ప్రయివేటు కళాశాలలు అక్టోబర్‌ 13 నుంచి బంద్ చేయనున్నట్లు అసోసియేషన్ వెల్లడించింది.

Update: 2025-10-03 03:56 GMT

తెలంగాణలో ప్రయివేటు కళాశాలలు అక్టోబర్‌ 13 నుంచి బంద్ చేయనున్నట్లు ప్రయివేటు కళాశాల యాజమాన్యం అసోసియేషన్ వెల్లడించింది.రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయకపోవడమే కారణమని తెలిపాయి. ఇప్పటివరకు ప్రభుత్వం కేవలం ఫీజు రీఎంబర్స్ మెంట్ కింద 200 కోట్లు మాత్రమే ఇచ్చిందని, ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేదని ఆ సంఘం నేతలు విమర్శించారు.

ఇచ్చిన వాగ్డానాన్ని...
డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు దసరా నాటికి 600 కోట్లు, దీపావళి నాటికి మరో రూ.600 కోట్లు విడుదల చేస్తామని వాగ్దానం చేసినప్పటికీ అమలు కాలేదని వారు తెలిపారు. అక్టోబర్‌ 12వ తేదీ లోగా మిగిలిన బకాయిలు ఇవ్వకపోతే 13 నుంచి సమ్మె తప్పదని వారు హెచ్చరించారు. అసోసియేషన్ నేతలు ఇకపై చర్చలు కేవలం ముఖ్యమంత్రితోనే జరుపుతామని చెప్పారు. అవసరమైతే విద్యార్థులతో కలిసి “చలో హైదరాబాద్‌” నిరసన చేపడతామని హెచ్చరించారు.


Tags:    

Similar News