Noone Sridhar : బ్యాంక్ లాకర్ తెరిచి చూస్తే గుండె గుభేల్ మందటగా

కాళేశ్వరం మాజీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ నూనె శ్రీధర్‌ ను ఏసీబీ అధికారులు ఐదు రోజులపాటు కస్టడీలోకి తీసుకుని విచారించారు

Update: 2025-06-25 07:57 GMT

కాళేశ్వరం మాజీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ నూనె శ్రీధర్‌ ను ఏసీబీ అధికారులు ఐదు రోజులపాటు కస్టడీలోకి తీసుకుని విచారించారు. న్యాయస్థానం అనుమతితో మొత్తం బ్యాంకు లాకర్లను ఓపెన్ చేశారు. ఒక్క స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోనే ఐదు లాకర్లు ఉన్నట్లు గుర్తించిన ఏసీబీ అధికారులు ఐదు లాకర్లను తెరిచి చూశారు. నాలుగు లాకర్లలో కీలకమైన డాక్యుమెంట్లతో పాటు బంగారు ఆభరణాలతో పాటు వెండి సామాగ్రి ఉన్నట్లు గుర్తించారు. ఒక లాకర్ లో మాత్రం ఐదు కోట్ల రూపాయల నగదును ఏసీబీ అధికారులు కనుగొన్నారని తెలిసింది.

కీలకమైన డాక్యుమెంట్లతో పాటు...
మాజీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ నూనె శ్రీధర్‌ లాకర్లను సీజ్ చేశారు. నమొత్తం ఐదు రోజుల పాటు నూనె శ్రీధర్ ను ఏసీబీ కస్టడీకి న్యాయస్థానం అనుమతించింది. ఐదురోజుల కస్టడీలో నూనె శ్రీధర్ అనేక సంచలన విషయాలు బయపెట్టినట్లు తెలిసింది. నాడు కాళేశ్వరం మాజీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ గా ఉన్ననూనె శ్రీధర్‌ అక్కడకు వచ్చే రాజకీయ నేతలతో పరిచయాలు పెంచుకుని ఇక రెచ్చిపోయాడని ఏసీబీ అధికారులు చెబుతున్నారు. రాజకీయ నేతలు, ఉన్నతాధికారుల అండదండలతోనే భారీగా ఆస్తులను కూడబెట్టినట్లు కనుగొన్నారు.
లెక్కకు మించిన ఆస్తులు...
అమీర్ పేట్ లో కమర్షియల్ కాంప్లెక్స్ తో పాటు ఇక తెల్లాపూర్ లో విల్లాతో పాటు కరీంనగర్ లో మూడు ఇళ్లు, షేక్ పేట్ లో ఒక ఫ్లాట్, ఇంకా వ్యవసాయ భూములున్నాయని ఏసీబీ అధికారులు తెలిపారు. ఇవి కాకుండా కరీనంగర్, హైదరాబాద్, వరంగల్ లలో పందొమ్మిది ఓపెన్ ప్లాట్లు ఉన్నాయని ఏసీబీ దర్యాప్తులో వెల్లడయింది. దీంతో పాటు పదహారు ఎకరాల వ్యవసాయ భూమి కూడా ఉంది. ఇక కార్లు, బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు కూడా ఉన్నాయి. వీటి మొత్తం ఆస్తుల విలువ రెండు వందల కోట్లకుపైగానే ఉంటుందని ఏసీబీ అధికారులు చెబుతున్నారు. మొత్తం మీద కాళేశ్వరం ప్రాజెక్టు మాజీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ నూనె శ్రీధర్‌ వ్యవహారం నాటి ప్రభుత్వానికి తలనొప్పిగా మారనుంది.
Tags:    

Similar News