Hyderabad : ఖైరతాబాద్ కాంగ్రెస్ లో డిష్యూం డిష్యూం

ఖైరతాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ లో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి.

Update: 2025-06-14 07:43 GMT

ఖైరతాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ లో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. ఎమ్మెల్యే దానం నాగేంందర్ వర్గీయులు, పీజేఆర్ కుమార్తె విజయారెడ్డి వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. ఇరు వర్గాలు నినాదాలు చేసుకున్నారు. ఒకరిని ఒకరు తోపులాటకు దిగారు. బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి గత ఎన్నికల్లో ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి విజయం సాధించిన దానం నాగేందర్ తర్వాత బీఆర్ఎస్ లో చేరారు.

విజయారెడ్డి మాట్లాడుతుండగా...
విజయారెడ్డి 2023 ఎన్నికలకు ముందే కాంగ్రెస్ లో చేరి పోటీ చేశారు. అయితే ఖైరతాబాద్ నియోజకవర్గంలో జరిగిన సమావేశంలో విజయారెడ్డి మాట్లాడుతుండగా దానం నాగేందర్ వర్గీయులు అడ్డుపడ్డారు. దీంతో ఇరువర్గాలు గొడవకు దిగాయి. ఒకరిని ఒకరు దూషించుకుంటూ నెట్టుకోవడంతో కొంత ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.


Tags:    

Similar News