మేడారం జాతరకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు

Update: 2026-01-21 04:12 GMT

మేడారం జాతరకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. మరికొద్ది రోజుల్లో మేడారం జాతర ప్రారంభం కానుంది. అందుకు ముందుగానే భక్తులు మేడారంలోని సమ్మక్క, సారలమ్మను దర్శించుకుని నిలువెత్తు బంగారాన్ని సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ నెల 28వ తేదీ నుంచి ప్రారంభమయ్యే మేడారం జాతర ఫిబ్రవరి ఒకటో తేదీ వరకూ కొనసాగనుంది.

ఆర్టీసీకి ప్రత్యేక బస్సులు...
మేడారం జాతరకు మూడు కోట్ల మంది భక్తులు హాజరవుతారని అంచనాతో అందుకు అవసరమైన ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి చేశారు. మేడారంలో నేడు మండమెలిగే పండుగకు ఏర్పాట్లు చేశారు. మేడారం జాతరకు తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతుంది. ఈనెల 25 నుంచి 31 వరకు ఆర్టీసీ స్పెషల్ సర్వీసులు నడపుతున్నట్లు టీజీ ఆర్టీసీ ప్రకటించింది. 50 శాతం అదనపు ఛార్జీలతో మేడారానికి 3,495 బస్సులు నడుపుతోంది.


Tags:    

Similar News