Congress : తప్పుడు ప్రచారాలను నమ్మొద్దు.. మమ్మల్ని నమ్మండి

బీఆర్ఎస్ వాస్తవాలను కప్పి పుచ్చి తప్పుడు ప్రచారం చేస్తుందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు

Update: 2024-04-19 06:54 GMT

బీఆర్ఎస్ వాస్తవాలను కప్పి పుచ్చి తప్పుడు ప్రచారం చేస్తుందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఆయన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో మాట్లాడుతూ నాలుగు నెలల్లో తమ ప్రభుత్వం 26 వేల కోట్ల రూపాయల అప్పు చెల్లించిందన్నారు. ఖజానాలో ఏడువేల కోట్ల బ్యాలన్స్ ఉందని బీఆర్ఎస్ చెబుతుందని, కానీ 3,600 కోట్లు మాత్రమే ఉన్నాయని, మిగిలిన డబ్బులు ఎక్కడికి పోయాయని ఆయన ప్రశ్నించారు. 3,927 కోట్ల విద్యుత్తు సబ్డిడీనీ తమ ప్రభుత్వం చెల్లించిందన్నారు. ఎంత విద్యుత్తు డిమాండ్ ఏర్పడినా ఇబ్బంది లేకుండా సరఫరా చేసేలా ప్రయత్నిస్తున్నామని తెలిపారు.

ఏడువేల కోట్ల రూపాయలను...
బీఆర్ఎస్ చేస్తున్న తప్పుడు ప్రచారం ప్రజలకు తెలియాలని మల్లు భట్టి విక్రమార్క అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై తాను ఎవరితోనైనా చర్చించేందుకు సిద్ధమన్నారు. విద్యుత్తు కోతలు లేకుండా చేయడానికి తమ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ప్రజలను ఆందోళనకు గురి చేసేలా ప్రచారం చేయడం తగదని మల్లు భట్టి విక్రమార్క హితవు పలికారు. ఏడు వేల కోట్ల రూపాయలు గత ప్రభుత్వం ఏం చేసిందని ఆయన ప్రశ్నించారు. విద్యుత్తు కోతలు లేకుండా చేస్తున్నామని తెలిపారు. న్యూ ఎనర్జీ పాలసీని తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.


Tags:    

Similar News