BRS : రాజ్యసభ అభ్యర్థి ఈయనేనట

రేపటితో రాజ్యసభ నామినేషన్ల గడువు ముగియ నుంది. దీంతో అభ్యర్థి ఎంపికపై మాజీ ముఖ్యమం త్రి కేసీఆర్ కసరత్తులు చేస్తున్నారు

Update: 2024-02-14 06:03 GMT

రేపటితో రాజ్యసభ నామినేషన్ల దాఖలు గడువుముగియనుంది. దీంతో అభ్యర్థి ఎంపికపై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కసరత్తులు చేస్తున్నారు. రేపు నామినేషన్ దాఖలు చేయడానికి ఆఖరి రోజు కావడంతో ఈరోజు అభ్యర్థి పేరును కేసీఆర్ ప్రకటించే అవకాశముంది. తెలంగాణలో మూడు రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి.

బలాబలాలను బట్టి...
శాసనసభలో బలాబలాలను బట్టి బీఆర్ఎస్ కు ఒక రాజ్యసభ సీటు ఖచ్చితంగా వస్తుంది. మిగిలిన రెండు స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంటుంది. అందుకే ఈరోజు కేసీఆర్ అభ్యర్థిని ప్రకటిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాజ్యసభ అభ్యర్థి రేసులో వద్ధిరాజు రవి చంద్ర, రావుల చంద్రశేఖరరెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. మరి వీళ్లద్దరికీ అవకాశమిస్తారా? కొత్త వ్యక్తికి కేసీఆర్ ఛాన్స్ ఇస్తారా? అన్నది నేడు తేలనుంది.


Tags:    

Similar News