Telangana : మేడారం జాతర ఈసారి ముందుగానే
తెలంగాణ కుంభమేళాగా పేరొందిన మేడారం సమ్మక్క జాతరకు సంబంధించిన తేదీలు ఖరారయ్యాయి
తెలంగాణ కుంభమేళాగా పేరొందిన మేడారం సమ్మక్క జాతరకు సంబంధించిన తేదీలు ఖరారయ్యాయి. అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన తెలంగాణ మమేడారం సమ్మక్క, సారలమ్మ జాతర ప్రతి రెండేళ్లకు ఒకసారి జరుగుతుంది. మహాశుద్ధ పౌర్ణమికి ముందువచ్చే బుధవారం రోజున ఉత్సవం ప్రారంభమవవుతుందని మేడారంలో పూజారులు తెలిపారు. ఏటా ఫిబ్రవరి నెలలోనే ఈ జాతర జరుగుతుంది. ఈ మహా జాతర ఈసారి 2026 జనవరి 28వ తేదీన జరగుతుందని తెలిపారు. ఆరోజు సారలమ్మ గద్దె మీదకు రావడంతో జాతర ప్రారంభం కానుంది.
లక్షలాది మంది భక్తులు...
29వ తేదీన సమ్మక్క దేవత గద్దె మీదకు రావడం, 30వ తేదీన భక్తులు మొక్కులు తీర్చుకోవడం 31వ తేదీన దేవతల వనప్రవేశంతో జాతర ముగుస్తుందని పూజారులు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ మేడారం జారతకోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించి పనులు ప్రారంభించనుంది. అక్కడ మంచినీరు, రహదారులు, మరుగుదొడ్లవంటి సౌకర్యాలను కల్పించనుంది. మేడారం జాతరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాల నుంచి పెద్దయెత్తున గిరిజనులు తరలి వస్తారు. లక్షలాది మంది తరలి వస్తుండటంతో జాతరకు సంబంధించిన ఏర్పాట్లను ప్రభుత్వం ఇప్పటి నుంచే మొదలుపెట్టాల్సి ఉంది.