Telanggana : తెలంగాణలో పంట నష్టం ప్రాధమిక అంచనా ఇదే
మొంథా తుఫాన్ నష్టంపై తెలంగాణ వ్యవసాయశాఖ ప్రాథమిక నివేదికను రూపొందించారు.
మొంథా తుఫాన్ నష్టంపై తెలంగాణ వ్యవసాయశాఖ ప్రాథమిక నివేదికను రూపొందించారు. తెలంగాణలో 4, 47,864 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు గుర్తించారు. 2,82, 379 ఎకరాల్లో వరి పంటకు నష్టం జరిగిందని తెలిపారు. 1,51,707 ఎకరాల్లో పత్తి పంట నష్టం జరిగింది. వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో ఎక్కువగా పంట నష్టం జరిగిందని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు.
వరంగల్ జిల్లాలో అధికంగా...
వరంగల్ జిల్లాలో 1,30,200 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని చెప్పారు. ఖమ్మం జిల్లాలో 62,400 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని వ్యవసాయ అధికారులు తెలిపారు. నల్గొండ జిల్లాలో 52,071 ఎకరాల్లోనూ, మొత్తం పన్నెవగు జిల్లాల్లో 179 మండలాల్లో పంట నష్టం జరిగిందని, 2.53 లక్షల మంది రైతులు నష్టపోయారని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు.