తెలంగాణ సచివాలయంలో కరోనా కలకలం !

బీఆర్కే భవనంలో పనిచేసే ఒక సీనియర్ ఐఏఎస్ అధికారికి కోవిడ్ పాజిటివ్ గా నిర్థారణ అయింది. దాంతో ఆయనతో సన్నిహితంగా

Update: 2022-01-08 05:00 GMT

తెలంగాణ సచివాలయంలో కరోనా కలకలం రేపింది. బీఆర్కే భవనంలో పనిచేసే ఒక సీనియర్ ఐఏఎస్ అధికారికి కోవిడ్ పాజిటివ్ గా నిర్థారణ అయింది. దాంతో ఆయనతో సన్నిహితంగా ఉన్న మరో ఉద్యోగులంతా వైరస్ నిర్థారణ పరీక్షలు చేయించుకోగా.. మరో నలుగురికి పాజిటివ్ గా తేలింది. మొత్తం ఐదుగురు ఉద్యోగులకు కోవిడ్ పాజిటివ్ గా తేలడంతో.. బీఆర్కే భవనంలో పనిచేసే ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది. బిల్డింగ్ లోని గదులన్నీ ఇరుకుగా ఉండటంతో వైరస్ వ్యాప్తి చాలా వేగంగా జరుగుతుందని వాపోతున్నారు.

ఇదిలా ఉండగా.. తెలంగాణలో నిన్న ఒక్కరోజే 2,295 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 278 మంది రికవరీ అవ్వగా.. రాష్ట్రంలో కోవిడ్ రికవరీ రేటు 97.98 శాతంగా ఉన్నట్లు ప్రజారోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 9,861 యాక్టివ్ కేసులు ఉండగా.. మృతుల సంఖ్య 4,039కి పెరిగింది.


Tags:    

Similar News