Fri Dec 05 2025 18:39:14 GMT+0000 (Coordinated Universal Time)
షో చేయడం ఆపండి.. పనిచేయండి... నేతలకు బాబు వార్నింగ్
టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం నియోజకవర్గం టీడీపీ నేతలపై సీరియస్ అయ్యారు. ఆయన కుప్పం పార్టీ నేతలతో సమావేశమయ్యారు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కుప్పం నియోజకవర్గం టీడీపీ నేతలపై సీరియస్ అయ్యారు. ఆయన కుప్పం పార్టీ నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్బంగా వారిపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఇక్కడి నేతలను నమ్ముకుని తాను రాష్ట్ర వ్యాప్తంగా పరువు పోగొట్టుకున్నానని చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు.
యువకులు ఏరీ?
తాను వచ్చినప్పుడు షో చేయడం కాదని, పార్టీని నిరంతరం కాపాడేలా ప్రయత్నించాలని చంద్రబాబు అన్నారు. నిత్యం ప్రజల్లో ఉండే నేతలను మాత్రమే తాను దగ్గరకు తీస్తానని, మిగిలిన వారిని దూరం పెడతానని చంద్రబాబు హెచ్చరించారకు. వ్యక్తిగత ఎజెండాలతో పార్టీకి నష్టం చేకూరిస్తే ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చారు. యువత పార్టీలోకి రాకుండా సీనియర్ నేతలు అడ్డుకోవడంపై కూడా చంద్రబాబు నిలదీశారు. తనకు 35 ఏళ్లుగా ఇక్కడ కొత్త మొహాలే కనపడటం లేదన్నారు. ప్రతి వంద ఓటర్లకు ఒక యువకుడిని ఏర్పాటు చేస్తామని, వాలంటీర్లకు పోటీగా సేవామిత్రను ఏర్పాటు చేస్తామని చంద్రబాబు చెప్పారు.
Next Story

