విద్యార్థినులకు కొవిడ్

మహబూబ్ నగర్ జిల్లా తొర్రూరులోని గురుకుల సంక్షేమ బాలికల పాఠశాలలో కరోనా కలకలం రేగింది.

Update: 2023-04-19 06:29 GMT

తెలంగాణలో కరోనా కేసులు ఎక్కువవుతున్నాయి. మహబూబ్ నగర్ జిల్లా తొర్రూరులోని గురుకుల సంక్షేమ బాలికల పాఠశాలలో కరోనా కలకలం రేగింది. ఎనిమిది మంది విద్యార్థులకు కరోనా సోకినట్లు పరీక్షల్లో నిర్ధారణ అయింది. మొత్తం 172 మంది విద్యార్థినులు, 39 మంది సిబ్బందికి పరీక్షలు నిర్వహించగా వీరిలో ఎనిమిది మందికి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ అయిందని వైద్యులు తెలిపారు.

జ్వరంతో ఉన్న ...
జ్వరంతో విద్యార్థులు బాధపడుతుండగా అనుమానం వచ్చి పరీక్షలు నిర్వహించారు. వైద్యశిబిరాన్ని ఏర్పాటు చేసి అందరికీ కోవిడ్ పరీక్షలు చేశారు. కరోనా సోకిన విద్యార్థినులను ఇళ్లకు పంపినట్లు అధికారులు తెలిపారు. మిగిలిన విద్యార్థులు కరోనా సోకకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. తల్లిదండ్రులు భయాందోళనలకు గురి కావాల్సిన అవసరం లేదని అధికారులు చెబుతున్నారు. ఉన్నతాధికారులు గురుకుల పాఠశాలను సందర్శించి పరిస్థితిని సమీక్షించారు.


Tags:    

Similar News