తెలంగాణలో కరోనా లేటెస్ట్ అప్ డేట్

తెలంగాణలో కరోనా కేసులు బాగా తగ్గాయియి. తాజాగా 1,380 కేసులు నమోదయ్యాయి. కరోనాతో ఒకరు మృతి చెందారు

Update: 2022-02-07 13:53 GMT

తెలంగాణలో కరోనా కేసులు బాగా తగ్గాయియి. తాజాగా 1,380 కేసులు నమోదయ్యాయి. కరోనాతో ఒకరు మృతి చెందారు. నెల రోజుల తర్వాత వెయ్యి కేసులకు పడిపోవడం విశేషం. తెలంగాణలో ఇప్పటి వరకూ 7,78,910 మందికి కరోనా సోకింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటి వరకూ తెలంగాణలో 7,50,809 మంది కరోనా నుంచి కోలుకున్నారని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.

తగ్గుతున్న యాక్టివ్ కేసులు...
ప్రస్తుతం తెలంగాణలో యాక్టివ్ కేసులు కూడా క్రమంగా తగ్గుతున్నాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 24,000 ఉన్నాయని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటి వరకూ 4,101మంది కరోనా కారణంగా మరణించారు.


Tags:    

Similar News